తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు మూగజీవులు సైతం తాగేందుకు నీటిచుక్క దొరక్క అల్లాడుతున్నాయి. ఎక్కడైనా నీటిబొట్టు కనిపిస్తే గొంతు తడుపుకుందామా అన్నట్టు చూస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో పిడచకట్టుకుపోతున్న గొంతును తడుపుకునేందుకు ఆవుపడిన ఆరాటం చూపరును కదిలించింది.