దగ్గరైనా, దూరమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువమంది ఇష్టపడేది ట్రైన్ జర్నీనే. సాధారణంగా బెర్త్ బుక్ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్ వద్దే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్‌ను UTS యాప్‌ను ప్రారంభించింది.