వేసవి ప్రారంభమైంది. సూర్యుడితోపాటు అగ్నిదేవుడు కూడా తన ప్రతాపాన్ని చూపించేదుకు రెడీ అయిపోయాడు. పలు చోట్ల వివిధ కారణాలతో అగ్నిప్రమాదాలు చోటచేసుకుంటున్నాయి. సాధారణంగా ఎండలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం మనం చూసాం. కానీ అర్ధరాత్రి చల్లని వెన్నెల వేళ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.