అయోధ్యలోని భవ్య రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈ క్రమంలో శ్రీరామ పాదుకాయాత్రలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకుంటూ వచ్చిన శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయి. సరిగ్గా 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండిని వినియోగించారు. మరో కిలో బంగారంతో ఆ పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు.