హీరోకు చేదు అనుభవం..కారు అడ్డుకుని ఆందోళన Sree Vishnu New Movie Shooting - Tv9

హీరో శ్రీవిష్ణుకు చేదు అనుభవం ఎదరైంది. షూటింగ్‌ లొకేషన్లో కొందరు కూలీలు.. ఆయన కారు అడ్డుకుని ఆందోళనకు దిగడం.. తెలుగు టూ స్టేట్స్‌తో పాటే.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే! నంధ్యాల జిల్లా.. బనగానపల్లె మండలం.. యాగంటి క్షేత్రంలో.. తన సినిమా షూటింగ్‌ కోసం శ్రీవిష్ణు వచ్చారు. అయితే ఆ సీన్‌ కోసం చాలా మంది జనాలు కావాల్సి రావడంతో.. మేకర్స్ ఆ చుట్టుపక్కల ఉన్న జనాన్ని.. కూలీకి లొకేషన్‌కు తీసుకొచ్చారు. షూటింగ్‌ కూడా సక్సెస్‌ ఫుల్‌గా ఫినిష్‌ చేశారు. కానీ ఆతరువాతే వారందరికీ కూలీ డబ్బులు సెట్ చేసే విషయంగా ప్రొడక్షన్ సభ్యులు కాస్త ఆలస్యం చేయడంతో... ఆ జనాలు కాస్త రెచ్చిపోయారు.