తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడాయన. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ కు కష్టంవిలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు షాయాజీ షిండే కెరీర్‌కి కూడా చిరంజీవి హెల్ప్ చేశారట.