అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, సూచించారు. తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో తాను మాట్లాడానన్నారు.