రోడ్లపై బైక్‌తో స్టంట్ లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్ ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. అసలేం జరిగిందంటే.. టీటీఎఫ్ వాసన్ యూట్యూబ్‌లో చాలా పాపులర్. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. సెప్టెంబరు 17న అతడు ఓ రోడ్ ట్రిప్‌లో భాగంగా చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు.