క్రికెట్ అభిమానులకు పండగ సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో బెట్టింగ్ రాయుళ్లకు సైతం కాసుల పంట పడుతోంది. సామాన్యుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బెట్టింగ్ కాస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేశాడు.