అండమాన్, నికోబార్ దీవులకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. బుధవారం ఉదయానికి విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారంనాటికల్లా ఇది తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు శ్రీలంక తీరాలకు సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.