సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 10 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరా క్యాంటీన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.