ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో కూడా మస్క్ జోక్యం అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో డెమోక్రాట్లు ప్రెసిడెంట్ మస్క్ అంటూ విమర్శలు కూడా చేశారంటే అమెరికా రాజకీయాల్లో ఆయన పాత్ర అర్ధమవుతోంది. అంతేకాదు మస్క్ సాంకేతికంగా అందరికంటే ముందే ఉంటారు.