అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం లోని భూపతిపాలెం రిజర్వాయర్‌లో చనిపోయిన కోళ్లు వందల సంఖ్యలో తేలియాడుతున్నాయి. దీంతో జలాశయంలో నీరంతా కూడా కలుషితం అవుతుందనీ స్థానికులు బెంబలెత్తిపోతున్నారు.. ఎందుకంటే ఈ ప్రాజెక్టులోని నీటినే రంపచోడవరం మండల కేంద్రంతో పాటు సుమారు 50 కి పైగా గిరిజన గ్రామాలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు. భూపతి పాలెం జలాశయానికి రంపచోడవరం లోని ఏజెన్సీ లో ఉన్నటువంటి అత్యధిక సాంద్రత కలిగిన ఏకైక రిజర్వాయర్