భూమి అడుగున మహాసముద్రం! - Tv9

భూమి మూడు పొరలుగా ఉంటుందని.. వాటిని క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అంటారని మనం చదువుకున్నాం. తాజాగా పరిశోధకులు ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. భూమికి సుమారు 700 కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని గుర్తించారు! ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింగ్వుడైట్ అనే రాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు.