టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ముందువరుసలో నిలుస్తున్నారు. భీమవరంలో తప్పిపోయిన ఓ ఏడేళ్ల బాలికను డ్రోన్ కెమరాను ఉపయోగించి గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. చిన్నగొల్లపాలెంకు చెందిన బొర్రా నాయనమ్మ అనే వృద్ధురాలు తన మనవడు, మనవరాలని తీసుకుని ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి భీమవరం హెడ్ పోస్టాఫీసు వద్దకు వెళ్లింది.