సుదూరా ప్రాంతాలకు ప్రయాణించాలంటే మొదటి ఆప్షన్ రైలు. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది దీనినే ఎంచుకుంటారు. కొందరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తే ఇంకొందరు సౌకర్యవంతంగా ఉంటుందని ఏసీకోచ్‌లో ప్రయాణిస్తారు. అలా ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. దాంతో అతను ఇంత ఖర్చుపెట్టి ఏసీ టికెట్ కొనుక్కుంది ఇందుకేనా అంటూ తనకు రైల్లో ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.