Isro Drone On Mars అంగారకుడిపైకి డ్రోన్ .. ఇస్రో మరో ప్రయోగం.. - Tv9

అంగారకుడిపై ప్రయోగాల కోసం మంగళయాన్ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు 2022తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగరాకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది.