ప్రముఖ హీరోయిన్ సమంత దీపావళి పండుగను రాజస్థాన్ లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రణతంబోర్ జాతీయ పార్కులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో సమంత చాలా బలహీనంగా కనిపిస్తున్నారని, కాస్త బరువు పెరగాలని ఓ అభిమాని కోరారు. ఈమేరకు సోమవారం సమంత ఇన్ స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ లో సదరు అభిమాని ఈ కామెంట్ చేశారు.