ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ - Tv9

ఈసారి సంక్రాంతి పండక్కి సినిమాల జాతర ఉండబోతుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సర్దుబాటు కష్టంగా మారింది. ఇటు నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు.