చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చేసింది..! ఈసారి ఆ ఊరే టార్గెట్టా..! - Tv9

ఏపీలో గతంలో భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు.