నా చెల్లెళ్లను అమ్మేయాలని చూశారు.. అందుకే చంపేశా

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో న్యూ ఇయర్ వేళ దారుణం జరిగింది. ఓ హోటల్‌ గదిలో ఓ వ్యక్తి తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను హత్య చేసాడు. వారి వయసు 9 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉంది. ఘటనా స్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.