చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ గడువును మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం చంద్రబాబును వర్చువల్ విధానంలో జడ్జి ముందు ప్రవేశపెడతారని తెలిసింది. రిమాండ్ పొడిగింపుపై ఇవాళ సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.