తెలుగు రాష్ట్రాల్లో పాములు హల్‌చల్ చేస్తున్నాయ్. ఒకచోట ఇంట్లో దూరితే.. మరోచోట కారు, బైక్స్‌లో ప్రత్యక్షమై ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వ్యక్తి టూవీలర్‌లో నాగుపాము దూరింది. బైక్ ముందుభాగంలోని డోమ్‌లో పాము బుసలు కొట్టడం చూసి.. చాలాసేపు శ్రమించి బయటకు తీశారు.