అఘోరాగా టాలీవుడ్ స్టార్ హీరో.. లుక్స్ చూస్తూ.. గూస్ బంప్సే.. Gaami Movie First Look - Tv9 Et

డైరెక్టర్ విద్యాధర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గామి’. ఈ మూవీ తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా గురించి చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేయగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో టాలీవుడ్ యంగ్ హీరో అఘోరగా భయపెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పోస్టర్ డిజైనింగ్ చాలా బాగుంది. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే” అంటూ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ అతను ఎవరో గుర్తుపట్టారా ?.. ఎవరో కాదు.. యంగ్ హీరో విశ్వక్‌ సేన్.