ఎవరైనా దొంగతానానికి వెళ్తే ఏం చేస్తారు. దొరికినకాడికి సంచుల్లో సర్దుకుని ఉడాయిస్తారు. కానీ కొందరు దొంగలు వెరైటీగా ప్లాన్ చేసారు. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో చక్కగా నచ్చిన వంట చేసుకొని సుష్టిగా భోంచేసి, ఓ దమ్ములాగి, తీరిగ్గా నగా నట్రా మూటగట్టుకొని చక్కా వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నోయిడాలోని పదులకొద్దీ ఇళ్లల్లో చోరీ జరిగింది.