ఇంకెప్పుడూ ఇలా చేయను.. క్షమించండి

తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.