‘వీకెండ్ భార్య’పై కోర్టుకెక్కిన భర్త..! @Tv9telugudigital

గుజరాత్‌లో విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నెలలో రెండు వారాంతాల్లో తన భర్త ఇంటికి వెళ్లడం తన దాంపత్య బాధ్యతలను నెరవేర్చినట్లేనా అనే అంశాన్ని లేవనెత్తుతూ గుజరాత్‌కు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది. భార్య నెలలో కేవలం రెండు వారాంతాల్లోనే తన ఇంటికి వస్తోందని, ఆమె రోజూ తనతోనే ఉండేలా ఆదేశాలివ్వాలని సూరత్‌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు ఆమె భర్త. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది.