సామ్‌తో చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసిన చైతూ! Naga Chaitanya Samantha

సామ్ తో విడాకుల అనంతరం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేస్తున్న నాగ చైతన్య... మరోసారి అదే పని చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాల్లో సామ్ తో కలిసున్న ఫొటోలన్నింటినీ ఇప్పటికే డిలీట్ చేసిన చై.. ఇప్పటి వరకు ఒక్క ఫొటో మాత్రం డిలీట్ చేయకుండా అలాగే వదిలేశాడు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్ తో పాటు 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా ఉన్నాయి.