పద్మ అవార్డుల విషయంలో సీఎం‌కు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణలో పద్మ అవార్డుల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నక్సల్ భావజాలం ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు అవార్డ్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు, పోలీసుల చావుకు గద్దర్ కారణమన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డ్‌ ఇచ్చేదే లేదు.బండి సంజయ్ అవార్డులకు అర్హత ఉన్న పేర్లను రాష్ట్రం పంపించాలి. రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించదు అని తెలిపారు.