దక్షిణాదిలో ఇప్పుడు స్టార్ హీరోస్ రెమ్యూనరేషన్ ఏకంగా 100 కోట్లు దాటింది. ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు హీరోలు. అలాగే.. ఇటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ చిత్రాలు ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ ఏడాది భారీ చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్టార్ హీరోస్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. షారుఖ్, సల్మాన్, ప్రభాస్, విజయ్ సేతుపతి, చిరంజీవి, బాలకృష్ణ ఖాతాల్లో సూపర్ హిట్స్ చేరాయి. కానీ ఓ హీరో మాత్రం ఈ సంవత్సరం ఏకంగా 1000 కోట్లు సంపాదించి అతిపెద్ద ఘనత సాధించారు. అతనెవరో తెలుసా ?.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.