ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా దుమారియా బ్లాక్‌కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు.