చూసి రెండేళ్లయింది.. మాట్లాడి ఏడాదైంది కుమారుడిని తలుచుకుని ధావన్ కన్నీరు

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన కుమారుడ్ని తలచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడు జొరావర్‌ను చూసి రెండేళ్లు గడిచిపోయిందని, తనతో మాట్లాడి ఏడాది దాటిందని తెలిపారు. తన కుమారుడితో మాట్లాడేందుకు అన్ని దారులు మూసుకుపోయాయని, అయినా తాను తన కుమారుడికి ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుమారుడి గురించి తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యాడు.తన కొడుకుని చూసి రెండేళ్లు అయిందని, తనతో చివరగా ఏడాది క్రితం మాట్లాడానని, చాలా కష్టంగా ఉన్నా అలానే ఉండటం అలవాటు చేసుకున్నానని చెప్పారు.