టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ప్రముఖ నటులతో కలిసి యాక్ట్ చేశారు ఫిష్ వెంకట్.