ఇండస్ట్రీలో ఎదగాలంటే అదే షార్ట్ కట్.. బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పారు. ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా తాము ఎదురుకొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పోరాటం చేస్తున్నారు.. ఇంకొంత మందైతే.. అలాంటి అనుభవాలను తాము ఎదుర్కోలేదంటూ చెబుతున్నారు.