లండన్‌లో కింగ్ కోహ్లీ- అనుష్క.. కృష్ణదాస్ కీర్తనలు వింటూ సందడి

బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, దర్శకులు, గాయకులు, క్రికెటర్లందరూ అనంత్ అంబానీ ఇంటి పెళ్లిలో సందడి చేశారు. కానీ ది మోస్ట్ సెలబ్రిటీ కపుల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ- నటి అనుష్కా శర్మ మాత్రం ఈ పెళ్లికి గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంట లండన్‌లో ఉంది. T20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు కింగ్ కోహ్లీ. అనుష్క శర్మ తన పిల్లలిద్దరితో కలిసి ఇప్పుడు లండన్‌లోనే ఉంటోంది. అందుకే విరాట్ కూడా టోర్నీ ముగిసిన వెంటనే లండన్ కు వెళ్లిపోయాడు.