బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అభిమానులపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తనపై తప్పుడు ప్రచారం చేశాయని, అందుకే వారిపై పరువు నష్టం దావా కేసులు వేయలనుకుంటున్నాడట పల్లవి ప్రశాంత్. ఇందుకోసం తన లాయర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది.