ఏటీఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. దాంతో ఎంత దూరం వెళ్లినా క్యాష్ క్యారీ చేయక్కర్లేకుండా కార్డు వెంటపెట్టుకొని వెళ్తే సరిపోయేది. దీనిని అధిగమిస్తూ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక కార్డుతో కూడా పనిలేకుండా పోయింది. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది కొంత ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే ఏటీఎంలో కార్డుద్వారా డబ్బులు డ్రా చేసుకోవడం తెలియనివారు ఇతరులపై ఆధారపడుతున్నారు.