సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్.. ఆ వెంటనే కల్కి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. ఏకంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.