నేడు అంటే జనవరి 6.. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెహమాన్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఆయన పాటలు ఇప్పటికే ఎప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు రెహమాన్. సంగీత రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. రెండు ఆస్కార్ అవార్డులు గెలుగుకొని గుర్తింపు పొందాడు. ఆసియాలోనే తొలిసారిగా ఆస్కార్‌ను గెలుచుకున్న వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు రెహమాన్.