గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో

పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ల కుటుంబాలు ఉంటే మంచిదని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నారు. మైదానంలో కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికి ఇష్టపడతానని చెప్పారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 ఓటమి అనంతరం కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 45 రోజులకు మించిన పర్యటనలో కుటుంబ సభ్యులు.. క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండడానికి వీల్లేదు. చిన్న పర్యటనల్లో వారం వరకు ఉండొచ్చు.