చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది వీడియో

చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వారికి ఓ ఐదేళ్లు వచ్చే వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పురుడు, బారసాల, నామకరణం, అన్నప్రాసన, చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు తీయడం, ఆడ పిల్లలు అయితే గాజులు వేయడం ఇలా ప్రతీ దాన్ని పండగలాగే జరుపుతారు. అలాంటి ఓ కార్యక్రమమే చేయబోయిందో కుటుంబం. ముఖ్యంగా తమ ఆరు నెలల శిశువుకు చెవులు కుట్టించాలనుకున్నారు. అయితే ఇదే వారు చేసిన తప్పులా మారింది. కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లా హంగల గ్రామానికి చెందిన ఆనంద్, శోభ దంపతులకు ఇటీవలే పండంటి మగ బిడ్డ జన్మించాడు.