శ్రీకాళహస్తిని చుట్టుముట్టిన కష్టాలు తొలగిపోనున్నాయి. ఆలయ మాస్టర్ ప్లాన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. త్వరలో అధికారులు 300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడు దశల్లో పనులు ప్రారంభించనున్నారు. శివుడు.. శ్రీకాళహస్తీశ్వరుడిగా అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా కొలువైన కాళహస్తి ఆలయం త్వరలోనే సరికొత్త హంగులు, అందాలు సంతరించుకుని, సకల సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది.