శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు.. ప్రధాన గేట్లకు తాళాలు వేసి నినాదాలు.

నెల్లూరు, డిసెంబర్‌ 13: నంద్యాల జిల్లా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. కార్యాలయం లోపలికి చొచ్చుకుని వెళ్లారు. గిరిజనుల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారూ నాయక్ ఆధ్వర్యంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల గిరిజనులు శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ధర్న నిర్వహించారు. ప్రాజెక్టు ఆఫిసర్ కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపి ప్రధాన గేట్లను మూసివేసి తాళాలు వేసి నిరసనలు చేశారు. ఐటీడీఏ పీఓ బయటకు రావాలని నినాదాలతో గిరిజనులు హోరెత్తించారు.