చైనా అధ్యక్షుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అమ్మాయిలు.. ప్లీజ్ పెళ్లి చేసుకోండి. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కనండి.. అంటూ ఆ దేశ యువతను వేడుకుంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతుండటంతో, అభివృద్ధికి ఆమడదూరంలోకి వెళ్లిపోతామని ఆయన భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే దేశంలోని యువతులంతా పెళ్లి చేసుకోవాలని మరోమారు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఆల్ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో జిన్‌పింగ్ యువతులు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు.