బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు ఐదేళ్లు పట్టింది.. Anand Deverakonda - Tv9

దొరసాని సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, బేబీ మూవీతో బ్లాక్‌బ్లస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్, బ్రేకప్ విషయాన్ని పంచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు.