బీ అలర్ట్ .. హెచ్చరిస్తున్న ‘సైబర్ దోస్త్’ @Tv9telugudigital

సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. జనాన్ని బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది సినిమాలంటే ఇష్టపడతారు. కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపుతారు. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్‌లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. విడుదలైన 40 రోజుల తర్వాతే ఏ సినిమా అయినా ఓటీటీలో చూడొచ్చు. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ కు డబ్బులు కట్టాలన్న భావనతో ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఫ్రీ మూవీస్‌ కోసం సెర్చ్‌ చేస్తుంటారు.