ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది.