దీపావళి పండుగవేళ స్నేహితులతో పందెం కాసి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. కొత్త ఆటో వస్తుందని ఆశపడిని ఆ యువకుడికి ఆరోజుతో నూరేళ్లూ నిండిపోయాయి. పండగ వేళ కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.