పంజాబ్ లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం! - Tv9

పంజాబ్ రాష్ట్రంలో చైనా డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. ఇంటెలిజెన్స్ నుంచి పక్కా స‌మాచారం అందుకున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఆదివారం అమృత్‌స‌ర్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు చైనా డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌స‌ర్ జిల్లాలోని హ‌ర్డో ర‌ట్టన్, గ్రామ‌డాక వ్యవ‌సాయ పొలాల్లో రెండు డ్రోన్లు ప‌ట్టుబ‌డిన‌ట్లు అధికారులు వెల్లడించారు.