బాలీవుడ్ బాద్ షా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. చాలా కాలం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు షారుఖ్. ఈ రెండు సినిమాలు దాదాపు 1000 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ‘డంకీ’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు బాద్ షా. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న హిందీలో విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ సినిమా బాక్సాఫీస్ అంతగా సెన్సెషన్ సృష్టించలేకపోయింది. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం షారుఖ్ రేంజ్‌లో రాబట్టలేకపోయింది.